● నిలకడగా ‘తోటపల్లి’
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు నీటి ప్రవాహం నిలకడగా ఉంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద బుధవారం సాయంత్రానికి 105 మీటర్లకు 104.49 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 410 క్యూసెక్కుల నీరు రాగా అధికారులు ఒక గేటును ఎత్తివేసి 695 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీఎంసీలకు, 2.210 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment