వేమన పద్యాలతోనే ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం
● వేమన విగ్రహంతో పురవీధుల్లో భారీ ర్యాలీ ● ఉత్తరాంధ్ర నుంచి హాజరైన వేలాది మంది భక్తులు
విజయనగరం టౌన్: ఆధ్యాత్మిక కవి వేమన భగవా న్ తన పద్యాల ద్వారా యావత్తు ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేశారని పలువురు పేర్కొన్నారు. ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా శాఖ అధ్యక్షుడు వానపల్లి శంకరరావు నేత్రత్వంలో ప్రబోధానంద యోగీశ్వరుల దివ్యాశీస్సుల తో వేమన జయంతి వేడుకలను టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ వేమన సాధార ణ వ్యక్తి కాదని, సాక్ష్యాత్తు భగవాన్ స్వరూపమన్నా రు. ఆయన పద్యాల ద్వారా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. జీవాత్మ, ఆత్మ పరమాత్మ విధానాన్ని ఆయన తన రచనల ద్వారా తెలియజేశారన్నారు. అనంతరం సమితి ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. మధ్యాహ్నం వేమన ప్రతిమను విజయనగర పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ రాజు, తూర్పు కాపు సంక్షేమ సంఘం చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు, బాలల న్యాయ మండలి సభ్యులు కరణం జనార్ధనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామానందం, జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉత్తరాంధ్ర ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment