![No Headline](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bbl150a-370005_mr-1739216004-0.jpg.webp?itok=fYMEAXIq)
No Headline
ఏళ్ల తరబడి గ్రీన్ అంబాసిడర్లగా పనిచేస్తున్నాం. 15 నెలలుగా జీతం ఇవ్వకపోయినా ప్రతి రోజూ ఊరిలోని చెత్తను ఊడ్చుతున్నాం. ఊరికి దూరంగా తరలిస్తున్నాం. మా లాంటి బడుగుజీవులపై రాజకీయ కక్షగట్టి.. పని నుంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయడం తగదంటూ రామభద్రపురం మండలం ఎస్.సీతారాంపురం పంచాయతీకి చెందిన గ్రీన్ అంబాసిడర్లు వెలగాడ సింహాచలం, ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’అంటూ తోటి గ్రీన్
అంబాసిడర్లు, సీఐటీయూ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముందు సోమవారం
ఆందోళన చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని అందరికీ విడమర్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను వివరించారు. ఎమ్మెల్యే మా వాడు.. మాకు నచ్చని వారిని తీసివేస్తామంటూ స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారని వాపోయారు. పాలకులు చెప్పినట్లుగా కార్యదర్శి ౖ
వెకుంఠరావు తందాన తానా అంటూ మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తూ నోటీసులు ఇచ్చారన్నారు. దళితులం.. ఏమీ చేయలేరన్న ఉద్దేశంతోనే పొట్టకొట్టారని, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయుకుడు బలస శ్రీనువాసరావు పాల్గొన్నారు. – రామభద్రపురం
Comments
Please login to add a commentAdd a comment