![● నంబర్‌లేని బండి.. ఎమ్మెల్యే తాలూకా అండి..!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vzg501p-600503_mr-1739216005-0.jpg.webp?itok=r3xA9vqn)
● నంబర్‌లేని బండి.. ఎమ్మెల్యే తాలూకా అండి..!
ఎటువంటి వాహనానికై నా నంబర్ ప్లేట్ సర్వసాధారణం. చిత్రంలో కనిపించిన బుల్లెట్‌కు మాత్రం నంబర్ ఉండాల్సిన స్థలంలో ‘నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు తాలూకా’ అనే అక్షరాలను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ప్రతీ కూడలిలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నా ఈ బుల్లెట్‌ను అడ్డుకోకపోవడం గమనార్హం. పొరపాటున ఏదైనా ప్రమాదానికి కారణమైతే ఆ బోర్డు మీద ఉన్న అక్షరాలను బట్టి
ఇంటిని వెత్తుక్కుని వెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు. మూడలాంతర్ల కూడలిలో నిలిపిన ఈ బుల్లెట్‌పై ఉన్న అక్షరాలను చిత్రంలో చూడొచ్చు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment