ముగిసిన ఖాదర్‌బాబా సుగంధ మహోత్సవాలు
విజయనగరం టౌన్: బాబామెట్టలో కొలువైన హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా 66వ ఉరుసు మహోత్సవాలు సోమవారం దర్గాలో నిర్వహించిన సలామ్, ఖుల్‌షరీఫ్‌తో ముగిశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన సుగంధ మహోత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఖాదర్ బాబా దర్గాలో సుగంధ, చాదర్ సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. సూఫీ పరంపర మహనీయులను స్మరించుకుంటూ విశ్వశాంతి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. దివ్య అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సూఫీ పీఠాధిపతులు ఖాజా మొహియుద్దీన్ షా ఖాదరీ, దర్బా దర్బార్ ధర్మకర్త ఖలీల్‌బాబు నేతృత్వంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రేమతత్వాన్ని ప్రబోధించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీ నాయిన, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తదితరులు బాబాను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment