సమగ్ర సర్వేకు సహకరించాలి
పెబ్బేరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించి అడిగిన వివరాలు చెప్పాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. ఆదివారం పెబ్బేరు మూడోవార్డు బీసీకాలనీలో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేటర్లు వివరాలు ఎలా పూర్తి చేస్తున్నారో అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్యూమరేటర్లు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. ఆయన వెంట ఆర్డీఓ, తహసీల్దార్ లక్ష్మి, మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ గణేష్, ఎంఈఓ జయరాములు, రాధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment