అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
గోపాల్‌పేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆదివారం గోపాల్‌పేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నిజమైన అర్హులకు మాత్రమే రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు ఆత్మీయ భరోసా పథకాలు అందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ నెల 21నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను స్వీకరించడంలో ప్రజలకు సహకరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కళ్లలో పెట్టి చూసుకుంటామన్నారు. అంతకుముందు తాడిపర్తికి చెందిన పార్టీ కార్యకర్త శంకరయ్యను పరామర్శించారు. సమావేశంలో ఉమ్మడి మండల ఇన్‌చార్జి సత్యశీలారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment