భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు రవాణా అలవెన్స్ కింద రూ.500, ఎస్కార్ట్ అలవెన్స్ కింద రూ.550, అమ్మాయిలకు ప్రతినెలా రూ.200 స్టైఫండ్‌ను ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుకుంటున్న 21 రకాల వైకల్యాలున్న విద్యార్థులందరికీ వారివారి వైకల్యాలను బట్టి వార్షిక పరీక్షల్లో చాలావరకు మినహాయింపులు ఇచ్చింది. మూగ, చెవుడు, అంధులు, మెడ సంబంధిత వ్యాధులు, బుద్ధిమాంద్యం, మస్తిష్క పక్షవాతం, అంగవైకల్యం, వెన్నముక సమస్యలు, గ్రహణమొర్రి, గ్రహణ చీలిక, మరగుజ్జులాంటి వారికి వార్షిక పరీక్షల్లో పది మార్కులకే ఉత్తీర్ణత పొందేలా ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రత్యేక అవసరాల విద్యార్థులు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment