వరిసాగులో దేశంలోనే ప్రథమ స్థానం
మదనాపురం: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఘనత తెలంగాణకు దక్కిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని రామన్‌పాడులో డ్రోన్ సాయంతో వరి విత్తనాలు వెదజల్లే ప్రయోగాత్మక కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి నాట్లు వేయడానికి స్థానికంగా కూలీలు దొరకక ఇతర రాష్ట్రాల నుంచి రప్పించే పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడి అధికమవుతుందని వివరించారు. ఇలాంటి తరుణంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఉమ్మడి పాలమూరులో డ్రోన్‌తో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ నిపుణుల విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో డ్రోన్లు ఆపరేట్ చేస్తున్న యువతకు తన సొంత నిధులతో లైసెన్స్‌లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వివరించారు. కార్యక్రమలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, గిన్నె శ్రీనివాస్‌రెడ్డి, వడ్డె కృష్ణ, జగదీశ్, మహేష్, శ్రీధర్‌రెడ్డి, అంజద్‌అలీ, అక్కల మహదేవన్‌గౌడ్, హనుమాన్‌రావు, టీసీ నాగన్నయాదవ్, రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహ ం లింకన్, కేవీకే శాస్త్రవేత్త మస్తానయ్య, వివిధ గ్రామాల రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment