ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేలా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు. ప్రజవాణికి మొత్తం 11 ఫిర్యాదులు రాగా అందులో 4 భూ సమస్యలు, 5 పరస్పర గొడవలు, రెండు భార్యాభర్తల తగాదాలకు సంబంధించినవి ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పరిష్కారానికి ఫిర్యాదులను ఆయా ఠాణాల అధికారులకు పంపించామన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment