వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎల్కతుర్తి: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మెయింటెన్ చేస్తున్న రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆశా డే కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలిచ్చారు. గ్రామాల్లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై (కౌన్సెలింగ్) అవగాహన కల్పించాలన్నారు. చాలా మంది సీ్త్రలు గర్భస్రావ మాత్రలను ఉపయోగించి సమస్యలు ఎదుర్కొంటున్నారని దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మెడికల్ స్టోర్స్‌లో మందుల లభ్యత, రికార్డులు తనిఖీ చేశారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శ్రీనాఽథ్, ఎంఎల్‌హెచ్‌పీలు డాక్టర్ వర్ష, అరవింద్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment