గీసుకొండ: దళారుల ప్రమేయం లేకుండా గొల్ల, కురుమలకు గొర్రెలకు బదులు ప్రతీ యూనిట్‌కు రూ.రెండు లక్షల నగదు బదిలీ చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు నగరబోయిన సారంగం డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ వంచనగరిలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ చేయాలని, మూడు నెలలకు ఓసారి నట్టల నివారణ మందు వేయాలని, ఖాళీగా ఉన్న పశువైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ధర్నాకు గొల్ల, కురుమలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు సంగ రాజు, శివ, నరేశ్, కె.కట్టయ్య, చరణ్, గణేశ్, సుమన్, రాజ్‌కుమార్, హరీశ్ పాల్గొన్నారు.
యూనిట్‌కు రూ.రెండు లక్షలు ఇవ్వాలి
జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు సారంగం
Comments
Please login to add a commentAdd a comment