● పూర్తి కావొచ్చిన సేకరణ
● మిల్లులకు తరలింపు
హన్మకొండ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. మొత్తం 1.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యానికిగాను మంగళవారం నాటికి 85,244 టన్నుల సేకరణ పూర్తయింది. దీనిలో 84,778 టన్నులు ఇప్పటికే మిల్లులకు తరలించినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 44, పీఏసీఎస్ ద్వారా 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 19,393 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. ఆ ధాన్యాన్ని జిల్లాకు కేటాయించిన 46 రైస్ మిల్లులకు పంపించారు. కొనుగోలు ప్రక్రియ దాదాపుగా పూర్తయినా కేంద్రాలను ఇంకా కొనసాగిస్తున్నట్లు అధికా రులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని శాయంపేట, ఆత్మకూరు మండలాల్లో మాత్రమే కొద్దిపాటి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని.. అది కూడా పూర్తయితే నూరుశాతం లక్ష్యం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అదే విధంగా జిల్లాలో 98 శాతం చెల్లింపులు పూర్తయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment