లోక రక్షకుడు.. యేసు ప్రభువు
క్రిస్మస్ పండుగను బుధవారం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఫాతిమా కేథడ్రల్ చర్చి, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్, దేశాయిపేట సెంటినరీ బాప్టిస్ట్, వరంగల్ క్రిస్టియన్ కాలనీ సీబీసీ తదితర చర్చిల్లో క్రైస్తవులు సామూహికంగా ఏసు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. బిషప్‌లు, పాస్టర్లు, ఫాదర్లు, సంఘ పెద్దలు దైవ సందేశం ఇచ్చారు. హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన వేడుకలకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డీసీపీ శోభన్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాస్టర్లు, ఫాదర్లతో కలిసి కేక్ కట్ చేశారు. లోక పాపముల పరిరక్షణ కోసం యేసుక్రీస్తు జన్మించారని, ఆయన బోధనలు అందరికీ ఆదర్శనీయమని సందేశం ఇచ్చారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్లు హనుమకొండ/వరంగల్
నగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు
సామూహిక ప్రార్థనలు
దివ్య సందేశం ఇచ్చిన దైవజనులు
Comments
Please login to add a commentAdd a comment