మన్మోహన్‌సింగ్ గొప్ప ఆర్థికవేత్త
సంగెం: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా చరిత్రలో నిలిచిపోతారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ, ఆధార్‌కార్డు, సమాచార హక్కు చట్టం వంటి వాటిని ప్రవేశపెట్టిన ఆయనను దేశం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటుందన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు మెట్టుపల్లి రమేశ్, మడత కేశవులు, నాయకులు ఆగపాటి రాజు, రాజ్‌కుమార్, రమేశ్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సంధ్య పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
సంగెంలో మాజీ ప్రధానికి ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment