ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాకొద్దు..
● మచ్చాపూర్‌లో అధికారులకు
ఓ వ్యక్తి విన్నపం
గీసుకొండ: మండలంలోని మచ్చాపూర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలు గు సంక్షేమ పథకాలపై మంగళవారం అధికారులు గ్రామ సభ నిర్వహించారు. సభలో అర్షం మనోజ్ అనే వ్యక్తి భూమిలేని పేదల కోసం అర్హులైన వారికి ఏడాదికి రూ.12 వేలు అందించే ఇందిరమ్మ ఆత్మీ య భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ గ్రామసభలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. తనకు వ్యవసాయ భూమి ఉందని, ఉపాధి హామీ కింద వంద రోజుల పని దినాల్లో పాల్గొన్నానని, ఈ పథకం కింద తనకు అర్హత లేదని, అందుకే లబ్ధిదారుల జాబితానుంచి తన పేరు తొలగించాలంటూ గ్రామసభలో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment