భీంపల్లి ఏఏఎంను పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
కమలాపూర్: ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని భీంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ నెల 24న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం)లో జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు (ఎన్‌క్వాస్) అసెస్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ మందిరంలోని వివిధ విభాగాలు, రిజిస్టర్లు, రికార్డులు, పరికరాలను పరిశీలించారు. అసెస్మెంట్ కోసం సూచించిన పనుల పురోగతిని సమీక్షించి డీఎంహెచ్‌ఓ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఆవరణలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ రేణుక, జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్, ఆరోగ్య పర్యవేక్షకురాలు కనకలక్ష్మి, ఏఎన్‌ఎంలు ఇందిరా ప్రియదర్శిని, రజిత, సరస్వతి, హెల్త్ అసిస్టెంట్లు ప్రభాకర్, శివశంకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment