రోడ్ల పనులు అడ్డుకోవడం సరికాదు
ఖానాపురం: రోడ్ల పనులు కాంగ్రెస్ అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు తండాలకు వెళ్లే రోడ్లను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో తండాలు, గ్రామాలకు లింకురోడ్ల ను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. టెండర్లు పూర్తయి కంకరపోసిన రోడ్ల పనులను ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరెడ్డి ముందుచూపు లేకుండా రద్దు చేయించారని చెప్పారు. కంకర రోడ్లతో అనేక మంది ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. రోడ్ల నిర్మాణ పనులు అడ్డుకున్న వారు గ్రామాల్లోకి ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ స్వప్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment