● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● ప్రజావాణికి 103 అర్జీలు
వరంగల్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించలేని సమస్యలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 వినతులు వచ్చినట్లు తెలిపారు.
‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment