నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి
కమలాపూర్: వేసవిలో గ్రామాల్లో తాగు ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేశం సిబ్బందిని ఆదేశించారు. కమలాపూర్‌లోని బీసీ కాలనీ, కాశీంపల్లి ప్రాంతాలను, ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్లను సోమవారం ఆయన పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం గ్రామాల్లో పర్యటించి నీటి సరఫరా తీరును పరిశీలిస్తున్నట్లు, ఆదిశగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుండె బాబు, ఎంపీఓ రవి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ అనిల్, గ్రిడ్ ఏఈ కిరణ్, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment