మద్యం మత్తులో యువకుల వీరంగం
నెక్కొండ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించి, గొడవకు దిగిన సంఘటన నెక్కొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనర్సింహా వైన్ షాపు సమీపంలో దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన జెట్టి రాజు, ఉల్లేరావు ప్రణీత్ మద్యం సేవించారు. ఈ క్రమంలో మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆటోను వారు అడ్డగించారు. డ్రైవర్ రాపాక ధనమంత్రితో గొడవకు దిగారు. దీంతో స్థానికులు 100కు డయల్ చేయగా.. కానిస్టేబుల్ లక్షయ్, హోంగార్డు చిమ్ననాయక్ అక్కడికి చేరుకున్నారు. గొడవను పోలీసులు అదుపుచేస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఆ యువకులు వారితో వాగ్వాదం చేసి దాడికి దిగారు. పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్‌ను లాక్కొని విధులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు యువకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విధులను అడ్డుకుని, ట్యాబ్ లాక్కున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.
అడ్డుకున్న పోలీసులపై దాడి
ఇద్దరిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment