నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాయిప్రీతమ్‌కు ఫిడే రేటింగ్
కాజీపేటకు చెందిన సాయిప్రీతమ్ చెస్‌లో 1,547 అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ను సాధించాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో నిర్వహించిన 13వ స్కూల్ గేమ్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉన్నతమైన రేటింగ్‌ను సాధించినట్లు కోచ్ కన్నా తెలిపారు. కాజీపేటకు చెందిన కవిత, కృష్ణమూర్తి దంపతుల కుమారుడు సాయిప్రీతమ్ ఫాతిమానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. – వరంగల్ స్పోర్ట్స్
విద్యారణ్యపురి: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజూ రెండు సెషన్లలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, గురుకుల జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో మొత్తం 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ జనరల్‌సైన్స్ విద్యార్థులు 15,683 మంది, ఒకేషనల్ 1,956 మంది ప్రాక్టికల్స్ పరీక్షలు రాయబోతున్నారు. పర్యవేక్షణకు 86 మంది చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీలో కలెక్టర్ చైర్‌మెన్‌గా, డీఐఈఓ కన్వీనర్‌గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక జూనియర్ లెక్చరర్, సభ్యులుగా పలువురు అధికారులు ఉన్నారు. ఇంకా 400 మందికిపైగా అధ్యాపకులను ఎగ్జామినర్లుగా ఇంటర్‌బోర్డు నియమించినట్లు సమాచారం.
సీసీ కెమెరాల నిఘా ఉండేనా ?
సీసీ కెమెరాల నిఘా మధ్య ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఇటీవల ఆదేశించారు. ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. అయితే సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని, ఈ విధానాన్ని రద్దు చేయాలని ఇటీవల జూనియర్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు డీఐఈఓతోపాటు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీఐఈఓ పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో బయట సీసీ కెమెరాలుంటాయని, ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసి సంబంధిత ఇంటర్ బోర్డుకు అనుసంధానించాల్సి ఉండగా.. అలా జరగలేదని తెలిసింది. ఈ విషయమై డీఐఈఓ గోపాల్‌ను అడగ్గా సీసీ కెమెరాలు ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామని, చేశారా లేదా అనేది క్లారిటీ లేదన్నారు. విధుల బిజీతో ప్రయివేట్ కళాశాలలను సందర్శించలేదని, పరీక్షలు ప్రారంభమయ్యాక వెళ్లి పరిశీలిస్తామన్నారు.
జనరల్ విద్యార్థులు 15,683
ఒకేషనల్ 1,956 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 86 సెంటర్లు
ఎగ్జామినర్లుగా 400 మంది అధ్యాపకులు
ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాలు
నిఘా వద్దంటున్న
ప్రైవేటు యాజమాన్యాలు
Comments
Please login to add a commentAdd a comment