ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు 10 రోజులే ఉంది. వనదేవతల దర్శనానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వాహనాల్లో చేరుకున్నారు. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌ల కింద స్నానాలు చేసి అమ్మవా ర్ల గద్దెల వద్దకు చేరుకుని పూజలు చేసి కానుకలు సమర్పించారు. ఒక్కరోజే సుమా రు 15వేల మంది తల్లులను దర్శించుకున్న ట్లు అధికారులు అంచనా వేశారు. దేవాదా య శాఖ ఈఓ రాజేంద్రం భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు.
మొదలైన భక్తుల తాకిడి
ఈనెల 12నుంచి 15వ తేదీ వరకు మినీజా తర నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా వనదేవతల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. పస్రా సీఐ రవీందర్, తాడ్వా యి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యాన భారీ బందోబస్తు నిర్వహించారు.
మేడారంలో వైద్య సేవలు
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు ఆదేశాల మేరకు మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. ఆది వారం శిబిరాన్ని తాడ్వాయి పీహెచ్‌ఏసీ వైద్యాధికారి ఆడెపు చిరంజీవి సందర్శించా రు. భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర కేసులను తాడ్వాయి పీహెచ్‌సీకి పంపాలని సూచించారు. డీపీఎంఓ సంజీవరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా
పోలీసుల బందోబస్తు
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈఓ రాజేంద్రం
మేడారానికి తరలివచ్చిన భక్తులు
గంటల మోతతో మార్మోగిన గద్దెల ప్రాంగణం
Comments
Please login to add a commentAdd a comment