మామూళ్ల మత్తు! | - | Sakshi
Sakshi News home page

మామూళ్ల మత్తు!

Published Mon, Feb 3 2025 1:20 AM | Last Updated on Mon, Feb 3 2025 1:21 AM

మామూళ్ల మత్తు!

మామూళ్ల మత్తు!

వరంగల్‌ అర్బన్‌: ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకుండా వేలాది మంది వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉన్నప్పటికీ ఫీజు చెల్లించకుండా సగానికిపైగా వ్యాపారులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం.. 90 శాతం ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయాల్సిన బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు మాముళ్ల మత్తులో జోగుతున్నారు. ఫలితంగా గ్రేటర్‌ వరంగల్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

45 శాతం లైసెన్స్‌ ఫీజులు వసూలు

నగరవ్యాప్తంగా ట్రేడ్‌ లైసెన్స్‌లు 22,485 ఉన్నాయి. 2024–25 డిమాండ్‌ రూ.4.42 కోట్లు ఉండగా.. ఈఆర్థిక సంవత్సరం డిమాండ్‌పై పెనాల్టీ 1.37 కోట్లు, ఇక పాత బకాయిలు 2.16 కోట్లు పాత బకాయిల పెనాల్టీలు రూ. 1.07 కోట్లు మొత్తం రూ.9.03 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కానీ.. ఏడాదంతా డిమాండ్‌ రూ. 2.74 కోట్లు, పాత బకాయిల పెనాల్టీ ఫీజు రూ.53.86 లక్షలు, మొత్తం రూ.3.88 కోట్లు వసూలు చేశారు. రూ.9.03 కోట్లగాను రూ.5.15 కోట్లు మాత్రమే వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. గత ఐదేళ్ల బడ్జెట్‌ లెక్కలు, వాస్తవాల్లో టార్గెట్లు, వసూళ్లు, పెండింగ్‌ వసూళ్లపై ఎక్కడా పొంతన కుదరకపోవడంపై అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడికక్కడ కుమ్మక్కు

నగరంలో ప్రతీ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిన్నాచితకా షాపులను నిర్వహిస్తున్న వ్యాపారులు సుమారు 35 వేలకు పైగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ.. బల్దియా ఉద్యోగులు చాలా మేరకు షాపుల జోలికి వెళ్లడం లేదు. ఒకవేళ ప్లింత్‌ ఏరియా ఆధారంగా కొలతలు వేస్తే బల్దియాకు రూ.6 నుంచి రూ.8కోట్ల వరకు ఆదా యం సమాకూరుతుంది. కానీ.. క్షేత్రస్థాయిలో బల్దియా జవాన్లు ఆవిధానాన్ని పాటించట్లేదు. మున్సిపల్‌ చట్టం–2019తూట్లు పొడుస్తూ చా లా మేరకు షాపులను వదిలేస్తున్నారు.వాస్తవా లను ఉన్నతాధికారులు,పాలకవర్గ పెద్దలు కూ డా పరిగణనలోకి తీసుకోవట్లేదు. దీంతో బల్దియా ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

సమయం లేకనే..

‘ఉదయం 5గంటలకు విధుల్లో చేరుతున్నాం. 10 గంటల వరకు ఇంటింటా చెత్త సేకరణ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు, రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించడంతోనే సరిపోతోందని బల్దియా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు సమాధానమిస్తున్నారు. దీంతో ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. ఆస్తి, నీటి, చెత్త పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక పన్నుల విభాగం ఉంది. కానీ.. వీరికి ట్రేడ్‌ లైసెన్స్‌ వసూళ్ల బాధ్యత అప్పగించలేదు. వీరు పట్టించుకోకపోవడం, మేయర్‌, కమిషనర్‌, ప్రజారోగ్యం విభాగం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలులో అధికారుల అలసత్వం

అడ్డదారిలో అందిన కాడికి వసూళ్లు

బల్దియా ఆదాయానికి భారీగా గండి

ఏడాదంతా చేసిన వసూళ్లు

45 శాతమే..

ఆర్థిక సంవత్సరం డిమాండ్‌, పెనాల్టీ వసూళ్లు పెండింగ్‌

2020–21 రూ. 4 కోట్లు రూ. 1.56 కోట్లు 39 శాతం

2021–22 రూ. 4.50 కోట్లు రూ. 2.10 కోట్లు 46 శాతం

2022–23 రూ. 5 కోట్లు రూ. 2.50 కోట్ల్లు 50 శాతం

2023–24 రూ. 5 కోట్లు రూ. 2.99 కోట్లు 59 శాతం

2024–25 రూ. 5.79 కోట్లు రూ. 3.27 కోట్ల్లు 55 శాతం

హెచ్చరిక..

బల్దియా పరిధిలో వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం కొనసాగిస్తే పెనాల్టీ విధిస్తారు. లైసెన్స్‌ పొందే వరకు నెలకు 10 శాతం చొప్పన ఫైన్‌ వేస్తారు.

ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం పెనాల్టీ

ఏప్రిల్‌ 1 నుంచి 50 శాతం పెనాల్టీ విధిస్తారు.

సకాలంలో చార్జీలు చెల్లిస్తే పెనాల్టీల నుంచి బయటపడతారు.

గడువులోగా చెల్లించాలి..

గడువులోగా ట్రేడ్‌ లైసెన్స్‌లు చెల్లించాలి. లేకపోతే పెనాల్టీలు జమవుతాయి. అందువల్ల వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చార్జీలు చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి

– రాజారెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ సీఎంహెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement