ప్రత్యక్ష నరకం!
సోమవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
మడికొండ: ఊపిరాడట్లేదు. పొగ పొసగనివ్వట్లేదు. ఉండాలో ఊరిడిసిపోవాలో తెలియట్లేదు. ఏంటి మాకీ నరకం అంటూ మడికొండ, అయోధ్యపురం, రాంపూర్, ఎలుకుర్తి, ధర్మసాగర్, బాపూజీనగర్, డీజిల్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 46, 64వ డివిజన్ పరిధి మడికొండ–రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజులుగా డంపింగ్ యార్డుపై పోరాటానికి అడ్ హక్ కమిటీ వేసుకుని కలెక్టర్‌ను, మున్సిపల్ అధికారులను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి డంపింగ్ యార్డుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కమ్ముకుంటున్న పొగ
నగరంలోని 66 డివిజన్ల నుంచి ప్రతీ రోజు సుమారు 500 టన్నుల చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. చెత్తను ఖననం చేసే క్రమంలో సాయంత్రం నుంచి ఉదయం 9గంటల వరకు గ్రామాలపై పొగమంచు కమ్ముకుంటోంది. చిన్నారులు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో కొంత మంది ఊపిరాడక ఆక్సిజన్ సిలిండర్లను కొని వాడుతున్నారు.
న్యూస్‌రీల్
డంపింగ్ యార్డు పొగతో అవస్థలు
శ్వాసకోశ వ్యాధుల
బారిన పడుతున్న పిల్లలు, వృద్ధులు
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా
ఎత్తేయడంలో నిర్లక్ష్యం
సీఎం హామీ బుట్టదాఖలు
ఎన్నికల ముందు మడికొండ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డంపింగ్ యార్డు సమస్యను తొలగిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డును తొలగిస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ తొలగించలేదు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హమీ మేరకు డంపింగ్ యార్డు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment