ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి తమ ఇంటి ఇలవేల్పని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఆలయ అభివృద్ధిపై స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. సందర్శనకు వచ్చిన చిన్నారులతో ఆయన ఫొటో దిగారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఫణీంద్ర, విష్ణు, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, అధికార ప్రతినిధి చాడ కొమురా రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్, మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు ఈర్ల ప్రవీణ్, మంద రమేశ్, జక్కుల రవి, సురేశ్, రమేశ్, జావేద్, జక్కుల సరిత, బోగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామికి పూజలు
Comments
Please login to add a commentAdd a comment