వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
క్యాన్సర్‌ను జయించి..
యుద్ధ ప్రాతిపదికన పనులు
మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర సమీపిస్తుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
– 8లోu
● ఈపక్క చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు రవి, స్వరూప. చేతిలో పాపతో ఆనందంగా కనిపిస్తున్న వీరిది స్టేషన్‌ఘన్‌పూర్. పెళ్లయిన కొన్నేళ్లకు రవికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. విషయం తెలియగానే రవి స్వరూప దంపతులు మాతృత్వానికి నోచుకోమని కుమిలిపోయారు. అధునాతన సాంకేతికతతో సంతానం పొందవచ్చని తెలుసుకుని ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. ముందుగా రవి స్పెర్మ్, స్వరూప అండాలను భద్రపర్చారు. అనంతరం రవి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆతర్వాత వారు ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు 8 నెలల పండంటి పాపతో ఆదంపతులు మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్‌ను సైతం జయించి మాతృత్వాన్ని పొందారు.
..ఇలా క్యాన్సర్ ఉన్నప్పటికీ అనేక మంది ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులవుతున్నారు. వైద్యంతో వ్యాధిని నయం చేసుకుంటున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. నేడు (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతున్న వారిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
● మహబూబాబాద్‌కు చెందిన రాజేశ్, సునీత దంపతులకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల క్రితం అతడికి వృషణ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులయ్యే అవకాశం లేదంటూ.. మానసికంగా కుమిలిపోయారు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసి హనుమకొండలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. రాజేశ్ కీమో థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, సునీత అండాలను భద్రపర్చారు. ఆతర్వాత ఐవీఎఫ్ ద్వారా వారికి ప్రస్తుతం పాప జన్మించింది. క్యాన్సర్ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కావడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
మొదట ఆందోళన చెందా..
మాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల నుంచి పిల్ల ల కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో మొదట తీవ్ర ఆందోళన చెందా. అనంతరం ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించాం. కీమో థెరపీకి వెళ్లే ముందు నా స్పెర్మ్‌ను భద్రపర్చి, ఆతర్వాత ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యం పొందాం. ఇప్పుడు మాకు ఏడాది బాబు ఉన్నాడు. చాలా ఆనందంగా ఉన్నాం. – విజయ్, హనుమకొండ
సంతానోత్పత్తికి ఆందోళన చెందొద్దు
దంపతుల్లో ఎవరికై నా క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా మాతృత్వపు అనుభూతిని వారు పొందొచ్చు. అయితే కీమో, రేడియేషన్ థెరపీలు చేయించినట్లయితే మగవారిలో స్పెర్మ్ చురుకుదనం, ఆడవారిలో అండఫలదీకరణ మందగిస్తుంది. అందుకే థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, ఎగ్స్‌లను స్టోర్ చేస్తాం. వారికి థెరపీ పూర్తయ్యాక అత్యాధునిక టెక్నాలజీలో ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యాన్ని అందిస్తాం.
– డాక్టర్ కావ్యరావు జలగం,
రీజనల్ మెడికల్ హెడ్,
ఓయాసిస్ ఫెర్టిలిటీ, హనుమకొండ
మొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
కళ్లు, లివర్ ఫంక్షన్లలో వచ్చే మార్పులను ఆధారంగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. మొదటి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చు. ఒకటి, రెండు స్టేజీలు దాటితే మాత్రం క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది. మూడో స్టేజీలో కీమో, రేడియేషన్ థెరపీల ద్వారా చికిత్స అందించవచ్చు. ఇప్పుడు థెరపీ చికిత్స ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. జిల్లాలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తున్నాం. – డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్‌ఓ, హనుమకొండ
598
552
1,259
59
334
జిల్లాల వారీగా క్యాన్సర్ బాధితులు
ములుగు
వరంగల్
హనుమకొండ
జనగామ
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment