మాతృత్వం వరించి
హన్మకొండ చౌరస్తా: క్యాన్సర్ మహమ్మారి ఏటా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. వయస్సు, లింగబేధం తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో భాగంలో మొదలై విస్తరిస్తోందీ. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి రెండు స్టేజీలు దాటితే మాత్రం సర్జరీల దాకా వెళ్లాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల సర్వేలో ఉమ్మ డి జిల్లాలో పలువరు వివిధ రకాల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.
కారణాలెన్నో..
సిగరెట్ తాగి ఒకరు క్యాన్సర్ బారిన పడితే.. మద్యం సేవించి మరొకరు. కలుషిత ఆ హారం తీసుకొని ఒకరు మహమ్మారి బా రిన పడితే.. పొగాకు, గుట్కా, పాన్ మసాలాలు తిని ఇంకొకరు ఇలా కారణాలేవైనా ప్రమాదం పొంచే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్యాన్సర్ వచ్చిన వాళ్లూ ఉన్నారు. కలుషిత, రసాయనాల పంటలు, పండ్లు తిని జబ్బు పడిన వారూ ఉన్నారు.
ఆనందంగా ఉన్నాం..
నాకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. అనంతరం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లుగా తెలిసింది. మొదట భయం వేసింది. కీమో థెరపీ తప్పనిసరి కావడంతో ముందుగా ఫెర్టిలిటీ సెంటర్‌లో నా అండాన్ని నిల్వ చేశారు. ఇప్పుడు బాబుకు జన్మనిచ్చా. మాతృత్వపు ఫలాన్ని అందుకుని మేం ఆనందంగా ఉంటున్నాం.
– మీనా, హనుమకొండ
జిల్లా ఓరల్ బ్రెస్ట్ సర్వేకల్ ఇతరులు
హనుమకొండ 83 215 111 189
వరంగల్ 235 192 125 00
జనగామ 31 79 97 137
ములుగు 21 08 30 00
బాధితుల్లో సంతాన ఫలాలు
హద్దుల్లేని ఆనందంలో దంపతులు
మొదటి దశలో గుర్తిస్తే తొందరగా
నయమవుతుందంటున్న వైద్యులు
నేడు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment