‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
వరంగల్: ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీఎంశ్రీ పథకంలో జిల్లాలో ఎంపికై న 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కంపోనెంట్‌ల వారీగా మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ఈ పథకానికి సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇప్పటివరకు రూ.1.22 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ లేబరేటరీలు, లైబ్రరీల ఏర్పాటు, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను పెంపొందించేందుకు గ్రీన్ స్కూల్, వెజ్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో స్టడీ టూర్ కొరకు వెంటనే ప్రణాళికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సెక్టోరల్ అధికారి వేణుగోపాల్, ప్రిన్సిపాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నిరుద్యోగులు నమోదు చేసుకోవాలి
జిల్లాలోని నిరుద్యోగులు, ప్రస్తుతం చదువుతున్న ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థులు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేలా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిలా డీట్ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ వెబ్‌సైట్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువతకు ప్రైవేటు రంగంలో ని రంతర ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందన్నా రు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజ యలక్ష్మీ, జిల్లా పరిశ్రమల అధికారి సాల్మాన్‌రాజు, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, యువజన క్రీడల అధికారి సత్యవాణి, అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment