మెనూ ప్రకారం భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Published Tue, Feb 4 2025 1:26 AM | Last Updated on Tue, Feb 4 2025 1:26 AM

మెనూ ప్రకారం భోజనం అందించాలి

మెనూ ప్రకారం భోజనం అందించాలి

నెక్కొండ: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించా లని ప్రత్యేక అధికారి అనురాధ అన్నారు. సోమవా రం హాస్టళ్లలో నెలకొన్న అవకతవకలపై కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు నెక్కొండలోని టీజీ గు రుకుల పాఠశాల/కళాశాల (బాలికలు), పోస్ట్‌ మె ట్రిక్‌ (బాలికలు/బాలుర) హాస్టళ్లు, పెద్దకొర్పోలు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లలో విచారణ చేపట్టామన్నారు. విధి నిర్వహణలో గైర్హాజరైన ఉపాధ్యాయులు, పాఠశాల రికార్డులు సరిగా లేక పోవడం, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోవడం, భోజన సరుకుల నిల్వ చేసే గదులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆ విషయాలపై విచారణ చేశామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఈ విచారణలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌, ఎంఈఓ రత్నమాల పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement