కమల సారథులు..
ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం.. మహబూబాబాద్‌పై సస్పెన్స్
రాష్ట్ర కౌన్సిల్‌లో వీరికే స్థానం...
బీజేపీ పార్టీ సీనియర్లు, ఇతర పదవులు ఆశించిన కొందరికి పార్టీ అధిష్టానం రాష్ట్ర కౌన్సిల్‌లో స్థానం కల్పించింది. జిల్లా అధ్యక్షులతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన కమిటీల్లో నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల, వరంగల్ పశ్చి మ నియోజకవర్గాలనుంచి గట్టుకొప్పుల రాంబాబు, రావుల సుదర్శన్‌ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అధిష్టానం నియమించింది. అదే విధంగా వరంగల్ జిల్లా నుంచి వడ్డెపల్లి నర్సింహులు, తాబేటి వెంకట్‌గౌడ్, మరిపెల్లి రాంచంద్రారెడ్డి, జేఎస్ భూపాలపల్లి నుంచి రాయరాకుల మొగిలి, జనగామ నుంచి మహేందర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రచ్చకుమార్, ములుగు నుంచి భూక్యా జవహర్‌లాల్‌కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా అవకాశమిచ్చారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందే సంస్థాగత కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు నెలలుగా రేపు, మాపు అంటూ వాయిదా పడుతున్న జిల్లా అధ్యక్షుల ఎంపికపై క్లారిటీ ఇచ్చింది. హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. కొద్దిరోజులుగా ఉన్న సస్పెన్స్‌కు సోమవారం తెరదించింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఐదు జిల్లాలనుంచి 10 మంది సీనియర్లకు రాష్ట్ర కౌన్సిల్‌లో సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఐదు జిల్లాల అధ్యక్షులు వీరే..
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. ఉమ్మడి వరంగల్‌లో ఐదు జిల్లాల సారథులను ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా నియామకపత్రాలను పంపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా రావు పద్మ మూడుసార్లు, జనగామ అధ్యక్షుడిగా ఆరుట్ల దశమంతరెడ్డి రెండుసార్లు పనిచేయగా.. తాజాగా వారి స్థానంలో హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోశ్‌రెడ్డి, జనగామ నుంచి సౌడ రమేశ్‌కు మొదటిసారి అవకాశం కల్పించారు. వరంగల్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులుగా ఉన్న గంట రవికుమార్, ఏడునూతల నిశిధర్‌రెడ్డి, సిరికొండ బలరామ్‌కు అధిష్టానం రెండోసారి అవకాశం ఇచ్చింది.
ఆశావహుల అసంతృప్తి..
మానుకోటలో పోటాపోటీ..
బీజేపీ నూతన జిల్లా కమిటీ, రాష్ట్ర కౌన్సిల్‌లో అవకాశం దక్కని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. హనుమకొండ జిల్లా సారథిగా మూడు పర్యాయాలు పనిచేసిన నాయకురాలి సూచనలకే అధిష్టానం ఓకే చెప్పడం.. అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించారన్న చర్చ ఇతర వర్గాల్లో సాగుతోంది.
కొందరు ఈ విషయమై సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ములుగు నుంచి చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్యా జవహర్‌లాల్ తదితరులు ఆశించినప్పటికీ రెండోసారి బలరామ్‌కే ఛాన్స్ ఇవ్వడం నిరాశపర్చింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న యలమంచిలి వెంకటేశ్వర్ రావు మళ్లీ తానే కొనసాగాలనే ఆసక్తితో ఉండగా.. వల్లభనేని వెంకటేశ్వర్లు, కాపరబోయిన సత్యనారాయణ, మాధవపెద్ది శశివర్దన్ రెడ్డి తదితరులు గట్టిగా పోటీ పడుతుండటంతో అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. మరో జిల్లాలో కూడా చాపకింది నీరులా ఉన్న అసంతృప్తితో ఉన్న ఆశావహనేతలకు సీనియర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ముగ్గురికి రెండోసారి,
ఇద్దరికి మొదటిసారి అవకాశం
పలువురు సీనియర్ నేతలకు
రాష్ట్ర కౌన్సిల్‌లో చోటు
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే
ఎట్టకేలకు నియామకం
మూడు జిల్లాల్లో అధ్యక్షుల
ఎంపికపై అసంతృప్తి?
Comments
Please login to add a commentAdd a comment