అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నర్సింహారావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నూతన అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (డాక్యుమెంటేషన్) అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ నర్సింహారావును నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సారయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆయనస్థానంలో నర్సింహారావును నియమించారు. ప్రస్తుతం నర్సింహారావు కేయూ పబ్లికేషన్ సెల్ డైరెక్టర్‌గా, దూరవిద్యాకేంద్రంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ట్రాన్స్‌జెండర్లకు
గుర్తింపుకార్డులు
హన్మకొండ: హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఐదుగురు ట్రాన్స్‌జెండర్లకు సర్టిఫికెట్, గుర్తింపుకార్డులను కలెక్టర్ ప్రావీణ్య అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా సంక్షేమశాఖ ద్వారా గుర్తింపుకార్డులు అందుకున్న వారు ప్రభుత్వ ఫలాలకు అర్హులని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి జయంతి మాట్లాడుతూ అఫిడవిట్ సమర్పించిన వారికి సర్టిఫికెట్, గు ర్తింపు కార్డులు అందించినట్లు తెలిపారు.ఈ కా ర్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు
సాధించాలి
కాజీపేట అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథ మ స్థానంలో నిలపాలని బీసీ వెల్ఫేర్ డీడీ రా మ్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సోమవారం బీసీ వె ల్ఫేర్ వసతి గృహాల పదోతరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వసతి గృహాల అధికారులు విద్యార్థులపై పర్యవేక్షణ కనబర్చి అత్యుత్తమ మార్కులు సాధించేందుకు దోహదపడాలన్నారు. కా ర్యక్రమంలో ఆర్‌సీఓ రాజ్‌కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవీ ప్రసాద్, డీబీసీడీఓలు శంకరయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి: జిల్లాలో ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల మొదటి, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 46 కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో మొదటి సెషన్‌లో జనరల్ సైన్స్ కోర్సుల విద్యార్థులు 2,088 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 2,016 మంది విద్యార్థులు హాజరయ్యారు. 72 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో 831 మందికిగాను 728 మంది హాజరుకాగా.. అందులో 103 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. రెండో సెషన్‌లో జనరల్ కోర్సుల విద్యార్థులు 1,729 మందికిగాను 1,678 మంది హాజరుకాగా.. 51 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 596 మందికిగాను 554 మంది హాజరుకాగా 42 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు.
భద్రకాళి దేవాలయంలో
వసంత పంచమి పూజలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శైశిర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వసంతపంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు అమ్మవారికి ఉదయం నుంచి పూర్ణాబిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment