కేసీఆర్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది
పరకాల: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ కూడలిలో మహాధర్నా చేపట్టారు. ఈధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదని, ఈప్రాంత బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వెంటనే రాజీనామా చేసి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దొమ్మాటి సాంబయ్య, గన్నోజు శ్రీనివాసాచారి, సోదా రామకృష్ణ, చందుపట్ల రాజిరెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్‌రెడ్డి, మడికొండ సంపత్‌కుమార్, పంచగిరి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
శాయంపేట: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపడంపై మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా.. కేవలం రాజకీయ ప్రయోజనాలకే బడ్జెట్ కేటాయించినట్లు ఉందన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి కూడా బడ్జెట్‌లో నిధులు తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణకు ప్రధాన్యం ఇవ్వాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
బడ్జెట్‌పై నిరసన..
కాంగ్రెస్ మహా ధర్నా
Comments
Please login to add a commentAdd a comment