ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి..

Published Tue, Feb 4 2025 1:26 AM | Last Updated on Tue, Feb 4 2025 1:27 AM

ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి..

ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి..

ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ

వరంగల్‌ క్రైం: అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన డ్రెయిన్‌ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని హనుమకొండ ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంక్షలు,

మళ్లించిన దారి ఇలా..

● హనుమకొండలోని అలంకార్‌ సెంటర్‌కి సమీపంలో ములుగు క్రాస్‌ రోడ్డు నుంచి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే దారిలో డ్రెయినేజీ నీటి కోసం మెయిన్‌ రోడ్డుపై డ్రెయిన్‌ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా వన్‌ వే ఏర్పాటు చేశారు.

● సోమవారంనుంచి ఈ దారిలో లారీలు, ఆర్టీసీ బస్సులు, రెడీమిక్స్‌ వాహనాలు, ట్రాక్టర్లు, ఇతర కమర్షియల్‌ వాహనాలకు అనుమతి లేదు.

● వాహనదారులు ములుగు క్రాస్‌ రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా కేయూ జంక్షన్‌ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది.

● హనుమకొండ బస్టాండ్‌, నక్కలగుట్ట, కాజీపేట వైపు వెళ్లాల్సిన టూవీలర్స్‌, ఆటోలు, కార్లు, మొదలగు వాహనాలు అలంకార్‌ సెంటర్‌, కాపువాడ, బాలంజనేయ స్వామి దేవాలయం మీదుగా ప్రయాణించాలి.

● వేయి స్తంభాలు గుడి నుంచి అలంకార్‌ సెంటర్‌ వరకు, అలంకార్‌ సెంటర్‌ నుంచి బాలాంజనేయస్వామి దేవాలయం వరకు రోడ్‌కి ఇరు వైపులా ఎటువంటి వాహనాలు పార్కింగ్‌ చేయరాదు.

● వాహనాలను రోడ్డుపై మరమ్మతులు చేయరాదు. ఈమార్గంలో ఇతర తోపుడు బండ్లకు కూడా అనుమతి లేదు.

● వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ రోడ్లలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement