రెండేళ్లుగా అమ్మఒడి | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా అమ్మఒడి

Published Thu, Jun 22 2023 1:06 AM | Last Updated on Thu, Jun 22 2023 1:06 AM

- - Sakshi

మా అమ్మాయి స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. గత రెండేళ్లుగా అమ్మ ఒడి పథకంలో రూ.15 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారు. దీంతో మా అమ్మాయి చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్‌కు పంపించగలుగుతున్నాం.

– వి.మౌనిక, విద్యార్థి తల్లి, మోగల్లు, పాలకోడేరు మండలం

అమ్మఒడి పథకంతో లబ్ధి

ముఖ్యమంత్రి జగనన్న అందజేస్తున్న అమ్మ ఒడి పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న మా అమ్మాయి చదువు నిమిత్తం ఇంతవరకూ రెండుసార్లు అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు బ్యాంకులో వేశారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు అమ్మ ఒడి వర్తింప చేయడం ఆనందంగా ఉంది.

– కడితల విజయ, ఐ.భీమవరం, ఆకివీడు మండలం

జాబితాలు సిద్ధం

ఈ ఏడాది అమ్మ ఒడి లబ్ధిదారులు జాబితా సిద్ధం చేస్తున్నాం. గత నాలుగేళ్లుగా అర్హత కలిగిన విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నిధులు జమచేశాం. ఈ ఏడాది సుమారు లక్షన్నర మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 28న అమ్మ ఒడి నిధులు బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.

– ఆర్‌.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

No comments yet. Be the first to comment!
Add a comment
1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement