నేటితరం గాంధీజీ సిద్ధాంతాలు తెలుసుకోవాలి
నిడమర్రు: నేటితరం యువత మహాత్మాగాంధీ సిద్ధాంతాలు తెలుసుకుని భవిష్యత్ తరాలకు అందించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర గాంధీ స్మారక నిధి చైర్మన్ కాజా పూర్ణచంద్ర గాంధీ అన్నారు. బుధవారం పెదనిండ్రకొలను మహాత్మా గాంధీ భవనంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పూర్ణ చంద్రగాంధీ గాంధీజీ మార్గదర్శకాలు వివరించారు. జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. అనంతరం గాంధేయ వాదులుగా ఉన్న కె.సర్వేశ్వరరావు, బంగార్రాజులను సర్వోదయ మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం గాంధీ భవనంలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించారు. జిల్లా సర్వోదయ మండల చైర్మన్ ఇందుకూరి ప్రసాదరాజు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు శరణాల మాలతీ రాణి, రుద్రరాజు ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్‌వీఎస్ రాజు, మానవత జిల్లా నాయకులు సాగిరాజు జానకిరామరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment