పనులు లేక.. సంక్షేమం కానరాక.. | - | Sakshi
Sakshi News home page

పనులు లేక.. సంక్షేమం కానరాక..

Published Mon, Oct 21 2024 1:56 AM | Last Updated on Mon, Oct 21 2024 1:56 AM

పనులు

అప్పులు చేసి సాగు

నేను కౌలుకి వ్యవసాయం చేస్తున్నా. కూటమి ప్రభుత్వం కౌలు రైతుకు సైతం పెట్టుబడి సాయం అందిస్తుందని ఆశించా. అయితే ఇప్పటివరకూ సాయం అందలేదు. దీంతో అప్పు చేసి సాగుకు పెట్టుబడి పెట్టాను. గత ప్రభుత్వంలో సాగుకు ముందే రైతు భరోసా కింద కౌలు రైతుకూ సాయం అందేది. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఎలాంటి సాయం అందించలేదు. సాగు ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాం.

– బి.రాంబాబు, కౌలు రైతు, కొండేపూడి

ఇబ్బంది పడుతున్నాం

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ పేరుతో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ఇ బ్బంది పడుతున్నాం. అంతా అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోంది. ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీయడమే తప్ప హామీల అమలు ఎప్పుడు చేస్తారో ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం గానీ చెప్పడం లేదు.

– బాషాఖాన్‌, నరసాపురం

భీమవరం(ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం పుణ్యమా నాలుగు నెలలుగా ప్రజలు బతుకుదెరువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, ఉపాధి హామీ పనులు లేకపోవడంతో పాటు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఎడతెగని వర్షాలతో పనులు సాగక పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీవనం కోసం అప్పుల బాట పడుతున్నారు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు డ్వాక్రా రుణాల చెల్లింపు, పిల్లల చదువుల ఫీజుల కోసం మహిళలు సైతం అప్పులు చేస్తున్నారు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో మోసం : కూటమి ప్రభు త్వంలో సూపర్‌ సిక్స్‌ పథకాల వస్తాయని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, అమ్మకు వందనం వంటి పథకాల ఊసెత్తకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

గత ఐదేళ్లు.. సంక్షేమ పరవళ్లు : గత జగన్‌ సర్కారులో ఐదేళ్ల పాటు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా తదితర పథకాలను నిర్దిష్ట సమయానికి పక్కాగా అమలు చేయడంతో ప్రజలకు ఆర్థిక భరోసా కలిగింది. ప్రతినెలా ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ధి చేకూరడంతో ప్రైవేట్‌ అప్పుల తిప్పలు తప్పాయి. కుటుంబ పోషణ, పిల్లల ఫీజులకు మహిళలకు పథకాలు అండగా నిలిచాయి. కరోనా విపత్తు సమయంలోనూ పథకాలు ఇచ్చి మాజీ సీఎం జగన్‌ ప్రజలను ఆదుకున్నారు.

నిర్మాణ రంగం కుదేలు : ‘పశ్చిమ’లో నాలుగు నెలలుగా పనులు లేక పలు రంగాల కార్మికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలయ్యింది. తాపీ, వ డ్రంగి, పెయింటింగ్‌, ఎలక్ట్రికల్‌, సెంట్రింగ్‌ తదిత ర కార్మికులకు పనులు దొరకడం గగనంగా మారింది. దీనికితోడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావడంతో ఉపాధి హామీ పనులు లేవు. వ్యవసాయ పను లు అంతంతమాత్రంగా ఉన్నాయి. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. రొయ్యల రైతులు నష్టాలు చూడటంతో పాటు ప్రాసెసింగ్‌ యూ నిట్లకు రొయ్యల దిగుమతులు తగ్గుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల్లో రోజువారీ పనుల చేసే వారికి పనులు ఉండటం లేదు.

ప్రజలకు అప్పుల తిప్పలు

పథకాలు అమలు చేయని కూటమి సర్కారు

వ్యవసాయ, ఉపాధి పనులు లేక పాట్లు

ఇసుక లేక భవన నిర్మాణ కార్మికుల వెతలు

నాలుగు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు

అప్పుల బాట పడుతున్న జనం

గత జగన్‌ సర్కారులో పథకాలతో ఊరట

2019–24 కాలంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలు

పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో)

అమ్మఒడి 2,46,525 597.62

రైతు భరోసా 2,25,883 282.59

ఆసరా 1,02,352 1,067.35

చేయూత 2,72,111 552.8

కాపు నేస్తం 2,24,286 79.40

ఈబీసీ నేస్తం 12,286 19.02

సున్నావడ్డీ 11,65,513 110.50

విద్యా దీవెన 67,837 119.64

వసతి దీవెన 59,871 80.70

No comments yet. Be the first to comment!
Add a comment
పనులు లేక.. సంక్షేమం కానరాక.. 1
1/2

పనులు లేక.. సంక్షేమం కానరాక..

పనులు లేక.. సంక్షేమం కానరాక.. 2
2/2

పనులు లేక.. సంక్షేమం కానరాక..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement