హైదరాబాద్, సాక్షి: పోలీసుల సంక్షేమానికి ఏటా రూ. 20 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
అమరులైన పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పోలీసులు నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ వీర మరణం పొందిన పోలీసులకు ప్రభుత్వం తరఫుణ రూ. కోటి పరిహారం అందిస్తాం. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌కు వర్తిసుంది. అదేవిధంగా ఎస్, సీఐలు విధి నిర్వహణలో మరణిస్తే.. 1. 25 కోట్ల పరిహారం అందిస్తాం. డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీలకు రూ. 1.5 కోట్లు, ఐసీఎస్ కుటుంబాలకు రూ. 2 కోట్ల పరిహారం అందిస్తాం. డ్రగ్స్ నివారణపై ఫోకస్ పెట్టాం. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేశాం. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే.. అందుకు పోలీసులే కారణం. రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకం. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావు.
రాష్ట్రం అభివృద్ధికి పోలిసుల నిరంతరం శ్రమిస్తున్నందుకు పోలీసులు అభినందనలు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. తీవ్రవాదులు మావోయిస్టుల చేతిలో మరణించిన అధికారులను స్మరించుకోవటం అందరికి స్ఫూర్తిదాయకం. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పంజాబ్ రాష్టంలో డగ్స్ వినియోగం పెరిగిపోయింది. తెలంగాణ రాష్టంలో డగ్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు TGNABను ఏర్పాటు చేశాం.
దేశానికే తెలంగాణ రాష్టం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. మందిరాల మీద, మజీద్‌ల మీద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తాం. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలి. వివిధ పండుగలు ప్రశాంతంగా జరుకోవడంలో పోలీస్ సేవలు మరచిపోలేము. జీతం కోసం పోలీస్ సిబ్బంది పనిచేయడం లేదు.. బాధ్యతయుతంగా భావించి పోలీసులు సేవలు అందిస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment