మావుళ్లమ్మ సన్నిధిలో ఉప లోకాయుక్త
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్త పి.రజని దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి ఈవీ సు బ్బారావు, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ వారికి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి ఫొటో అందజేశారు. డీఎస్పీ జయసూర్య, తహసీల్దార్ రాంబాబు ఉన్నారు.
సుదీర్ఘ కాల సేవలు అభినందనీయం
భీమవరం: పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం బాధ్యతాయుతంగా సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. తాడేపల్లిగూడెం టౌన్ స్టేషన్‌లో ఏఎస్సై బీవీఎస్ ప్రభాకరరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సింహాద్రి అప్పన్న పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యలయంలో సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ అంకిత భావంతో అందించిన సేవలను పోలీసు శాఖ గుర్తించుకుంటుందని, పదవీ విరమణ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం. సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
8 నుంచి ప్రజాపోరు
భీమవరం: అధిక ధరలు, నిరుద్యోగం, అత్యా చారాలు, జమిలి ఎన్నికలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 8 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపోరు పేరుతో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించను న్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారామ్ చెప్పారు. శుక్రవారం భీ మవరంలో చింతకాయల బాబూరావు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14న ఎంపీడీఓ కార్యాలయాలు, 15న కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తామన్నారు. జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ ఇసుక కొరత, మద్యం షాపులు, విద్యుత్ ట్రూఅప్ చార్జీలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు, పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లతో పేదలకు భరోసా
ఉండి: సామాజిక పింఛన్లు పేదలకు భరోసాగా నిలుస్తున్నాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిమితమై మంచానికే పరిమితమైన పాలపర్తి ప్రకాశం, దివ్యాంగురాలు పాలపర్తి సోమాలమ్మ, వృద్ధులు మద్దా రామారావు, మూరా జయరాజు, వితంతువు ముళ్లగిరి దీనమ్మకు పింఛన్ సొమ్ములు అందజేశారు. జిల్లాలో 2.33 లక్షల పింఛన్‌దారులకు రూ.96 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ ఎం వేణుగోపాల్, ఏపీఓ పింఛన్స్ టి.మురళీకృష్ణ, డీఎస్‌ఓ ఎన్.సరోజ, ఇన్‌చార్జి తహసీల్దార్ కె.నాగార్జున, ఎంపీడీఓ ఎస్.రవీంద్ర పాల్గొన్నారు.
దీపం–2 ప్రారంభం
పాలకొల్లు అర్బన్: దీపం–2 పథకంలో ఏడా దికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. మండలంలోని పూలపల్లిలో శుక్రవారం దీపం–2 పథకాన్ని మంత్రి నిమ్మల రామానాయు డు, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రా రంభించారు. జిల్లాలో 4.63 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దీపం–2 కార్యక్రమాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment