శివోహం.. భజేహం | - | Sakshi
Sakshi News home page

శివోహం.. భజేహం

Published Sat, Nov 2 2024 12:44 AM | Last Updated on Sat, Nov 2 2024 12:44 AM

శివోహ

శివోహం.. భజేహం

తణుకులో వ్యక్తి దారుణ హత్య
తణుకు పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో కాకర్ల దుర్గారావును హత్య చేశారు. 8లో u

శనివారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

సాక్షి, భీమవరం: హరహర మహాదేవ.. శంభో శంకర స్మరణలు మార్మోగుతున్నాయి.. పరమ పవిత్ర కార్తీక మాసోత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యా యి. కార్తీకమాసం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పంచారామ భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ముక్కంటిని దర్శించుకోనున్నారు. దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతుంది. గురువారం దీపావళిని జరుపుకోగా ఈ ఏడాది శుక్రవారం ఉదయం కూడా అమవాస్య ఘడియలు ఉండటంతో వేదపండితుల సూచనల మేరకు శనివారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేకువ జామునే స్నానాలు చేసి దీపారాధన చేయడం ద్వారా కార్తీక దామోదరునికి భక్తులు పూజలు చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, లక్ష బిల్వార్చనలు, దీపాలంకరణ సేవలు తదితర విశేష పూజలకు భక్తులు సన్నద్ధమయ్యారు.

సోమారామం.. క్షీరారామం

పంచారామాల్లోని రెండు ప్రధాన ఆలయాలతో జిల్లా పేరొందింది. భీమవరంలో ఉమా సోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం), పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ఉన్నాయి. సోమారామంలోని శివలింగం చంద్ర ప్రతీష్టగా ప్రతీతి. 9వ శతాబ్దంలో తూర్పుచాళుక్య రాజు చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అమావాస్య రోజున గోధుమ, నలుపు వర్ణంలో, పౌర్ణమికి శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడి శివలింగం ప్రత్యేకత. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం పంచ లింగాలు, పంచ శిఖరాలు, పంచ నందులు, పంచ గణపతులు, పంచ అమ్మవార్లతో పంచాయతన ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ స్వామి దర్శనానికి ఐదు ద్వారాలు దాటి వెళ్లాలి. కార్తీక మాసంలో భక్తులతో పాటు పంచారామాల సందర్శకులతో ఈ క్షేత్రాలు కిటకిటలాడతాయి. కార్తీక సోమ, ఆదివారాలు, కార్తీక పౌర్ణమి, మాసశివరాత్రి పర్వదినాల్లో 30 వేల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారితో పాటు తెలంగాణ నుంచి పంచారామ యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు.

చలువ పందిళ్లు.. విద్యుత్‌ కాంతులు

పంచారామ క్షేత్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, విద్యుత్‌ దీపాలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. ఉచిత దర్శనంతో పాటు రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారాలు, ప్రత్యేక పర్వదినాల్లో వేకువజాము 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే సౌకర్యం కల్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అభిషేకాలు, కార్తీక నోములు నోచుకునే భక్తులకు సోమారామంలో ఆలయం వెనుక ఏర్పాట్లు చేశారు. క్షీరారామంలో వేకువజామున కార్తీక దీపాలు వెలిగించేందుకు, దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం నెల రోజులూ రెండు ఆలయాల వద్ద భక్తులకు నిత్యాన్నదాన సదుపాయం కల్పించారు.

నైపుణ్య కోర్సులతో భవిత

పాలకొల్లు అర్బన్‌: సాంకేతిక విద్యపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, పదో తరగతి తర్వాత ఏ కోర్సులు అభ్యసిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంటో తెలుసుకుని ముందుకు సాగాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. మండలంలోని శివదేవునిచిక్కాల జెడ్పీ హైస్కూల్‌ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల పురోగతిని తెలుసుకున్నారు. వృత్తి నైపుణ్య కోర్సులపై శ్రద్ధ చూపాలన్నారు. టెన్త్‌ విద్యార్థులకు లెక్కలు బోధించారు. హెచ్‌ఎం పి.రాము ఉన్నారు.

న్యూస్‌రీల్‌

అసమర్థ పాలకుడు చంద్రబాబు

కార్తీకం.. పరమ పవిత్రం

మోక్షధామాలుగా పంచారామాలు

ఉమ్మడి జిల్లాలో శైవ క్షేత్రాల ముస్తాబు

కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

క్షేత్రాల్లో దర్శన వేళల పొడిగింపు

ప్రత్యేక సర్వీసులకు ఆర్టీసీ సన్నద్ధం

సర్వం సిద్ధం

కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో 30 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఈ రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశాం. క్యూలైన్లు, వాహనాలకు పార్కింగ్‌, ఇతర సదుపాయాలు కల్పించాం. శనివారం నుంచి ఆలయం వద్ద నిత్యాన్నదానం మొదలవుతుంది.

– రామకృష్ణంరాజు,

సోమారామం ఈఓ, భీమవరం

No comments yet. Be the first to comment!
Add a comment
శివోహం.. భజేహం 1
1/6

శివోహం.. భజేహం

శివోహం.. భజేహం 2
2/6

శివోహం.. భజేహం

శివోహం.. భజేహం 3
3/6

శివోహం.. భజేహం

శివోహం.. భజేహం 4
4/6

శివోహం.. భజేహం

శివోహం.. భజేహం 5
5/6

శివోహం.. భజేహం

శివోహం.. భజేహం 6
6/6

శివోహం.. భజేహం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement