దొడ్డిపట్లలో అదృశ్యం.. ఏలూరులో ప్రత్యక్షం
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఆడుకుంటూ ఓ బా లుడు (12) అదృశ్యమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన బాలుడు దీపావళికి నానమ్మ ఊరు దొడ్డిపట్ల వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం కొందరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు సాయంత్రం వరకూ గాలించినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం 7 గంటలకు పోలీసులను ఆశ్రయించగా కొద్ది సమయంలోనే బాలుడి ఆచూకీని కనిపెట్టారు. బాలుడి అమ్మమ్మ ఊరు ఏలూరు కావడంతో ఇక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏలూరు త్రీటౌన్ సీఐ ఎస్.కోటేశ్వరరావు ఆదేశాలతో ఎస్సైలు ప్రసాద్, రాంబాబు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 గంటల సమయంలో బాలుడి ఆచూకీ గుర్తించారు. హైదరాబాద్‌లో చదవడం తనకు ఇష్టం లేదని, విజయవాడలో చదువుకుంటానంటే పెద్దలు పట్టించుకోవడం లేదని, దీంతో ఇల్లు వదిలి బయటకు వచ్చానని బాలుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment