బుట్టాయగూడెం: బకాయిల పేరుతో దళితుల ఇళ్లల్లో విద్యుత్ మీటర్లు తొలగించడం దుర్మార్గమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.మాల్యాద్రి అన్నారు. మండలంలో విద్యుత్ అధికారులు మీట ర్లు పీకివేసిన దళితుల ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వర కూ ఉచిత విద్యుత్ అని చెబుతూనే మరో వైపు మీ టర్లు తొలగించడం దారుణమన్నారు. బాధ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలన్నారు. ప్రతి ఆరు నెలలకూ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ నిర్వహించాలన్నారు. విద్యుత్ మీటర్లు తొలగించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, మొగలి గంగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment