కూటమి పాలనలో ఎవరి సమస్యలు వారే తీర్చుకోవాలి అన్నట్టు ఉంది. ఏలూరులోని 18వ డివిజన్‌లో రోడ్డు అధ్వానంగా ఉండటంతో స్థానికులే బాగు చేసుకుంటున్నారు. 8లో u
నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ పోరుబాట నిర్వహించనుంది. నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా నిరసన తెలిపి విద్యుత్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేస్తారు. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు భీమవరంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేస్తారు. తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఉండిలో పార్టీ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజు, పాలకొల్లులో పార్టీ ఇన్‌చార్జి గుడాల గోపి, భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసనలు తెలపనున్నారు. అనంత రం చార్జీల తగ్గింపు కోరుతూ విద్యుత్ కా ర్యాలయాల్లో వినతిపత్రాలు అందజేయనున్నట్టు నాయకులు తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment