భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన వివిధ పార్టీ పదవులను కేంద్ర కా ర్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
● ఉపాధ్యక్షులుగా.. కర్రి రామలింగేశ్వరరెడ్డి (ఆచంట), బుద్దరాతి భరణి ప్రసాద్ (తణుకు), పెనుమత్స దుర్గా ప్రసాదరాజు (ఉండి), పప్పుల రామారావు (నరసాపురం), బండారు నాగు (తాడేపల్లిగూడెం), మేడిద జాన్సన్ (భీమవరం).
● జనరల్ సెక్రటరీలుగా.. దంపన బోయిన బాబూరావు (ఆచంట), మల్లిరెడ్డి నాగార్జున (తణకు), కొలుపూరి శివ కిరణ్ (తాడేపల్లిగూడెం), పాలా రాంబాబు (నరసాపురం). ట్రెజరర్‌గా.. వేగేశ్న జయ రామకృష్ణంరాజు (ఉండి).
● ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా.. దిద్దే శ్రీను (ఆచంట), సత్తి వెంకట రెడ్డి (ఆచంట), ఇందుగుపల్లి బలరాం కృష్ణ (తణుకు), వెలగల అ మ్మిరెడ్డి (తణకు), గుండా సుందర్రామ నా యుడు (ఉండి), పల్లెం అరుణకుమారి (ఉండి), దేవ రంజిత్ కుమార్ (నరసాపురం), బో ణం వీరయ్య (తాడేపల్లిగూడెం), చిటకన ప్ర సాద్ (తాడేపల్లిగూడెం), కలిదిండి బలరా మరాజు (భీమవరం), గోడి షణ్ముఖరావు (భీమవరం).
● సెక్రటరీ యాక్టివిటీలుగా.. గొల్లపల్లి బాలకృష్ణ (ఆచంట), సుంకర నాగబాబు (ఆచంట), కోట నాగేశ్వరరావు (తణుకు), పాలా సత్యనా రాయణ (తణుకు), సీహెచ్ పాపారావు (ఉండి), ఆదాడ నర్సింహరావు (ఉండి), తి రుమాని రామకృష్ణంరాజు (నరసాపురం), ముసుడి రత్నం (నరసాపురం), కడలి రాంబాబు (నరసాపురం), బుద్దని శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), పరిమి తులసీ దాసు (తాడేపల్లిగూడెం), పి.నర్సింహ స్వామి (భీమవరం), కాండ్రేగుల శ్రీను (భీమవరం).
● అధికార ప్రతినిధులుగా.. ఏడిద కోట సత్యనారాయణ (నరసాపురం), భూసారపు జయప్రకాష్ (నరసాపురం), కర్రి గంగాధర అ ప్పారావు (తణుకు), గొర్రిముచ్చు సుందర్ కు మార్ (ఉండి), గుబ్బల వీర బ్రహ్మం (ఆచంట), ముప్పిడి సంపత్ కుమార్ (తాడేపల్లిగూడెం), కామన నాగేశ్వరరావు (భీమవరం)లను నియమించారు.
వైఎస్సార్‌సీపీ మండల
అధ్యక్షుల నియామకం
భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని మండలాలకు పార్టీ అధ్యక్షులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. నరసాపురం ప ట్టణం కామన బాల సత్యనారాయణ, నరసాపురం మండలం ఉంగరాల రమేష్, మొగల్తూరు మండలం రేవు నారాయణరాజు, ఉండి మండలం పెన్మెత్స వెంకట రామకృష్ణ ఆంజనేయ రాజు, కాళ్ల మండలం గణేశ్న నాగ వెంకట శ్రీరామ సత్య స్వామి నాయుడు (రాంబాబు), పాలకోడేరు మండలం పాలా రాంబా బు, ఆకివీడు మండలం నంద్యాల సీతారా మయ్య, ఆకివీడు పట్టణం అంబటి రమేష్‌ను నియమించారు. ఆచంట మండలం జక్కంశెట్టి చంటి, పెనుగొండ మండలం వేణుప్రతాప్ రెడ్డి, పెనుమంట్ర మండలం మనదూరు దేవేంద్రుడు, పోడూరు మండలం పిల్లి నాగన్న, తణుకు పట్టణం మంగెన సూర్య, అత్తిలి మండలం పైబోయిన సత్యనారాయణ, ఇరగవరం మండం కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, తణుకు మండలం బోడపాటి వీర్రాజు, తాడేపల్లిగూడెం పట్టణం కొలుకులూరి ధర్మరాజు, తాడేపల్లిగూడెం మండలం జడ్డు హరిబాబు, పెంటపాడు మండలం కై కాల శ్రీనివాసరావు, భీ మవరం పట్టణం గాదిరాజు రామరాజు, భీమవరం మండలం జల్లా కొండయ్య, వీరవాసరం మండలం చవ్వాకుల సత్యనారాయణలను అధ్యక్షులుగా నియమించారు.
నేడు విద్యుత్ శాఖ సీఎండీ సమీక్ష
భీమవరం: విద్యుత్ శాఖ అధికారులతో ఆ శాఖ సీఎండీ శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. భీమవరం విష్ణు కళాశాలలో ఉదయం భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్లలోని ఈఈ, డీఈఈ, ఏఈ, ఏఏఓ, సర్కిల్ ఫైనాన్స్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు.
విచారణ అధికారిని మార్చాలని..
జగనన్న కాలనీల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల అవకతవకలపై విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోల్‌మాల్ వ్యవహారంలో ఏడీఈ స్థాయి అధికారిపై విచారణ జరగాల్సి ఉండగా అదే క్యాడర్ అధికారిని నియమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. డీఈ స్థాయి అధికారిని విచారణకు నియమించాలని విద్యుత్ శాఖ సిబ్బంది, బాధితులు సీఎండీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment