ఎస్సీలంతా ఐక్యతతో సాగాలి
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ ఎస్సీలు వివక్షత ఎదుర్కొంటున్నారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న లేడీస్ క్లబ్‌లో ఎస్సీల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు బాబూరావును కొనియాడారు. ఏలూరుకు సమీపంలోని కొవ్వలిలో పేద కుటుంబంలో జన్మించిన బాబూరావు విద్య ద్వారానే ఉన్నత శిక్షరాలకు చేరుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ దళితులను విభజించి వారి అవసరాలను తీర్చుకుంటున్నారన్నారు. దళితులంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో దళితుల ఐకమత్యం కోసం చేపట్టే ఉద్యమాన్ని ఏలూరు కేంద్రంగానే ప్రారంభిద్దామంటూ పిలుపు నిచ్చారు. తనకు మాలలు–మాదిగలు రెండు కళ్లులాంటి వారని గుర్తు చేసారు. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి చాగంటి సంజీవ కుమార్, ఊదర గొండి చంద్రమౌళి, పల్లెం ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు మున్నుల జాన్ గురునాథ్, సర్పంచ్‌లు పాము మాన్ సింగ్, బోదుల స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment