నాకై తే ఆనందంగా ఉంది
ప్రతినెలా విద్యార్థులు బియ్యం తెచ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
– పి.హర్షిత, బీకాం సెకండియర్
తల్లిదండ్రులే ముందుంటారు
నెలలో మూడో మంగళవారం వచ్చిందంటే చాలు కాలేజీకి బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.
– కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్
మార్పు కోసం చిన్న ప్రయత్నం
ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడం ఆనందంగా ఉంది.
– బి.రాణి దుర్గ, కామర్స్ లెక్చరర్
పంచే గుణం పెంచేందుకు..
తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ముఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రిన్సిపల్ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇది ఒకటి.
– డాక్టర్ సీహెచ్ చైతన్య, బోటనీ లెక్చరర్
విద్యతో పాటు విలువలు
మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేదవారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తున్నారు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమంలో పొల్గొంటున్నారు.
– డాక్టర్ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్
●
Comments
Please login to add a commentAdd a comment