అనసూయమ్మ కుటుంబానికి రూ.10 లక్షల సాయం
మానవతా దృక్పథంతో స్పందించిన వైఎస్ జగన్
పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్ఫథంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పాలకొల్లు పట్టణం 20వ వార్డుకు చెందిన కలిశెట్టి అనసూయమ్మ ఇంట్లోకి దుండగలు ప్రవేశించి బంగారు వస్తువులు ఎత్తుకుపోవడంతో పాటు అనసూయమ్మపై దాడి చేసి హత్యాప్రయత్నం చేశారు. ఆమె ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల గోపి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని తన సొంత నిధుల నుంచి ప్రకటించారు. ఈ సహాయాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అనసూయమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలపై అత్యాచారాలు అధికమయ్యాయని, శాంతి భద్రతలు క్షీణించాయని ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, యలమంచిలి ఇన్‌చార్జ్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment