అక్రమ మట్టి తవ్వకాలు అడ్డగింత
అధికారికి ఆక్వా రైతు బెదిరింపు
ఆక్వా రైతు నుంచి రక్షణ కల్పించాలంటూ డ్రెయినేజీ ఏఈ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు నాలుగున్నర గంటలు స్టేషన్ వద్ద పడిగాపులు కాశారు. 8లో u
ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాల చెరువులో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. గత కొద్దిరోజులుగా ఈ చెరువులో స్థానిక టీడీపీ నాయకులు కొందరు అక్రమ మట్టి తవ్వకాలను యథేచ్ఛగా జరుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి భీమడోలు, కై కలూరు తదితర ప్రాంతాలకు మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగానే ఈ అక్రమ దందా సాగుతున్నప్పటికీ ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. దీనిపై ఈ నెల 20న సాక్షి దిన పత్రికలో సత్తాల చెరువులో మట్టి దందా శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ తవ్వకాలపై దృష్టి సారించారు. తమను ఆపేది ఎవరన్నట్టుగా అక్రమార్కులు రెచ్చిపోయి మరీ ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతుండటంతో పోలీసుల చేతికి చిక్కారు. చెరువులో తవ్వకాలు జరుపుతుండగా ఒక జేసీబీని, రెండు టిప్పర్లను నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం చర్యలు నిమిత్తం మైనింగ్ శాఖకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment