పేకాటతీరం
నరసాపురం పేరు చెప్పగానే సుదీర్ఘ తీర ప్రాంతం, పచ్చటి పొలాలు, లేసు ఉత్పత్తులు, భిన్న సంస్కృతులు, ప్రశాంత వాతావరణం గుర్తుకొస్తాయి.. ఇక్కడ జూదాలు, విష సంస్కృతులకు స్థానం లేదు.. ఇంతటి ప్రశాంత తీరంలో మూడు పూటలా.. మూడు ముక్కలాటకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నరసాపురం చరిత్రలో తొలిసారిగా విష సంస్కృతికి నాంది పలుకుతూ పేకాట క్లబ్ ఏర్పాటుచేశారు. ఏకంగా జాతీయ రహదారి పక్కనే పక్కా భవానాన్ని సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది.
పోలీసుల మౌనముద్ర
బహిరంగంగా పక్కా భవనంలో క్లబ్ ఏర్పాటు చేసినా నరసాపురం పోలీసులు మౌనముద్రలో ఉండటం గమనార్హం. ప్రభుత్వంలోని కూటమి పెద్దల ఒత్తిళ్లతో పాటు పోలీసులకు కూడా సంతృప్తికరంగా తాయిలాలు ఇప్పటికే అందాయనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సమయంలో ఓ రోజు లాంఛనంగా క్లబ్‌ను తెరవడంతో పోలీసులు దాడిచేసి కొందరిని అదుపులోకి తీసుకున్నా రు. అయితే ఇది ప్రారంభంలో హడావుడి చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నం మాత్రమే అనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా ఏ ఆటంకాలు లేకుండా రానున్న ఉగాది నుంచి క్లబ్‌లో నిరాటంకంగా పేకాటలు ఆడించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నిర్వాకంపై నరసాపురం ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
నరసాపురం : జిల్లాలో పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు నడిచినా నరసాపురంలో ఇప్పటివరకూ లేవు. సంక్రాంతి సమయంలోనూ గతంలో పెద్దగా కోడిపందేలు, జూదాలు ఉండేవి కాదు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఈ ఏడాది కోడిపందేలు, జూదా లు బాగా పెరిగాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నరసాపురం ప్రాంతంలో తొలిసారిగా పేకాట క్లబ్‌ను బహిరంగంగానే ఏర్పాటుచేశారు. నరసాపురం మండలంలోని సీతారామపురం గ్రామంలో 216 జాతీయ రహదారి పక్కన పక్కా భవనాన్ని సిద్ధం చేశారు. ఏ అనుమతులు లేకుండా నరసాపురం యూత్ క్లబ్ అండ్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో బోర్డు కూడా తగిలించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అపప్రద మూటకట్టుకుంటున్నా ఎందుకు నోరు మెదపడంలేదనే అంశంపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది.
సిండికేట్‌గా ఏర్పడి..
నరసాపురం మండలంలోని సీతారామపురం, రుస్తుంబాద, భీమవరం మండలంలోని వెంప గ్రామాలకు చెందిన కొందరు సిండికేట్‌గా ఏర్పడి క్లబ్ నిర్వహణకు పూనుకున్నారు. అడ్డంకులు రాకుండా కీలక కూటమి నేతలకు ప్రతినెలా భారీ మొత్తంలో ముట్టజెప్పేలా ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. నరసాపురం–మచిలీపట్నం జాతీయ రహదారిపై ఇటీవల ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ రూట్‌లో విజయవాడకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అటు కృష్ణా జిల్లా నుంచి కూడా దూరం తగ్గింది. దీంతో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల వారికి అందుబాటులో ఉండేలా ఈ ప్రాంతంలో క్లబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పేరుపాలెం బీచ్ కూడా దగ్గరగా ఉండటం, పెద్ద సంఖ్యలో ఇటీవల రిసార్ట్స్ కూడా వినియోగంలోకి రావడంతో జూదంతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు కూడా అనువుగా ఉంటుందని, ఓ విధంగా ఈ ప్రాంతం సేఫ్‌జోన్‌గా ప్రచారంలో పెట్టించారు. తద్వారా చు ట్టుపక్కల జిల్లాల్లోని జూదరులను భారీగా ఆకర్షించవచ్చని సిండికేట్ ఆటోచనగా చెబుతున్నారు.
కూటమి బరి తెగింపు
నరసాపురంలో హైవే పక్కన పేకాట క్లబ్
పక్కా భవనం సిద్ధం చేసిన సిండికేట్
ఉగాది నుంచి పెద్ద ఎత్తున నిర్వహణకు సన్నాహాలు
ప్రతినెలా కూటమి నేతలకు ముట్టజెప్పేలా ఒప్పందాలు
నరసాపురంలో తొలిసారిగా విష సంస్కృతి
Comments
Please login to add a commentAdd a comment