‘అమ్మా’నుషం.. పైశాచికానందం
జంగారెడ్డిగూడెం: కన్న ప్రేమను కాదని.. ప్రియుడి మోజులో కడుపున పుట్టిన బిడ్డలను చిత్రహింసలకు గురిచేసింది.. చార్జింగ్ వైరుతో కొట్టి, గాయాలపై కారం పూసి చిన్నారులపై పైశాచిక దాడికి పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెంలో కలకలం రేపింది. స్థానికుల జోక్యంతో విషయం వెలుగుచూడగా, చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి వైద్యారోగ్యశాఖ అధికారులను విచారణకు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి.. కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారద భర్తతో విడిపోయి పిల్లలు ఉదయ్ రాహుల్ (9), రేణుక (5)తో కలిసి జంగారెడ్డిగూడెం సీఎన్‌ఆర్ మాల్ సమీపంలో నివాసముంటోంది. నల్లవెలుగుల పవన్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి ఆమె సహజీనం చేస్తోంది. రోజూ పవన్‌కుమార్ మద్యం సేవించి వచ్చి చిన్నారులు ఉదయ్‌రాహుల్, రేణుకను సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో చిత్ర హింసలు పెడుతున్నాడు. తల్లి శారద అతడికి సహకరిస్తూ చిన్నారులను కొట్టేది. చిన్నారుల వంటిపై గాయాలకు కారం పూయడంతో పాటు నోట్లో కా రం, పచ్చిమిర్చి కుక్కి హింసించేది. శనివారం అర్ధరాత్రి చిత్రహింసలు భరించలేక చిన్నారులు కేకలు వేసుకుంటూ బయటకు రాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై షేక్ జబీర్ చిన్నారులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తల్లి, ప్రియుడిని కఠినంగా శిక్షించాలి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పరామర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, తల్లిని, ప్రియుడిని అరెస్టు చేయడంతో పాటు చిన్నారుల బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని డి మాండ్ చేశారు. తాము కూడా సహాయ, సహకా రాలు అందిస్తామన్నారు.
కేసు నమోదు
తల్లి శారద, ప్రియుడు పవన్‌కుమార్‌పై కేసు నమో దు చేసినట్టు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆస్పత్రిలో చిన్నారులను ఆయన పరామర్శించారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో చిన్నారుల ఫొటోలు, వారి ముఖాలు కనిపించకుండా చూడాలని, చిన్నారులను ఇబ్బందులకు గురిచేయవద్దని డీఎస్పీ కోరారు. సీఐ వి.కృష్ణబాబు ఉన్నారు.
ప్రియుడితో కలిసి చిన్నారులను కొట్టి హింసించిన తల్లి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలలు
విచారణకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment